ఎండపొడ తగిలి మెరిసే నేలలా
ప్రేమను చుట్టుకుని మెరుస్తున్నాను
అలలు విరిగి ముక్కలై
సముద్రంలా పరుచుకున్న వాస్తవం ముందు
మట్టిముద్దలా నిల్చున్నాను
నాలోని చెట్లను,తీగెల్ని,ఎందపోడల్ని,నేలని
ప్రేమని ధరించే కళ్ళనూ
దేనికది విడదీసుకుంటూ ,లోపలికి తొంగిచూసుకుంటూ
రూపం ధరించని మట్టిముద్దలానే
ఇంకా ఇలానే మిగిలి ఉన్నాను
నాలోపలికి దూసుకొచ్చే యుద్దాలు
నన్ను బంధించే స్త్రీత్వాలు
నన్ను వర్ణించే 'సహనవతి'' ప్రతీకలు
గంభీరమైన సముద్రం ముందు హోరెత్తుతున్నాను
అలలా విరిగి పడుతున్నాను ,ఎగుస్తున్నాను
చెదరి చెదిరి తుంపర్లుగా మారిపోతున్నాను
నన్ను చూడని చరిత్రలో
నన్ను కన్నెత్తనీయని కబోధిధర్మాలు
నాకే ముఖమూ లేకుండా చెక్కేసిన చెక్కడాలు
మళ్ళీ నేను మట్టిముద్ద లోంచి
మానవి రూపంలోకి ప్రయానిస్తున్నాను
వ్యక్తీకరణ నా కొత్త కోణం ...!
"ఎంతెంత దూరం" కవితా సంపుటి నుంచి ,2005

welcome toblog
ReplyDeleteశిలాలోలిత గారూ !
ReplyDeleteబ్లాగు కుటుంబానికి స్వాగతం. ఈ బ్లాగు ద్వారా మీ కవిత్వం మాకు మరింత దగ్గరవుతుందని ఆశిస్తూ...
బ్లాగు ప్రపంచానికి స్వాగతం!
ReplyDeleteWelcome...Welcome
ReplyDeletemeekandariki thanks
ReplyDelete